చిత్తూరులో కలకలం: 51 డివిజన్లు ఏకగ్రీమంపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: చిత్తూరు

చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకంగా ఏభై ఒక్క డివిజన్లు ఏకగ్రీమం కావడం తీవ్ర వివాదానికి దారితీయడంతో జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, దీనిపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. నకిలీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు.