కేటీఆర్ పాస్పోర్ట్ కోరుతూ ఏసీబీ కేవలం దరఖాస్తు మాత్రమే వేసిందని న్యాయవాది లక్ష్మణ్ వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాస్పోర్ట్ సమర్పించాలంటూ ఏసీబీ కోర్టులో కేవలం దరఖాస్తు మాత్రమే దాఖలు చేసిందని, ఇప్పటివరకు కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన న్యాయవాది జక్కుల లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ ఉడుముల (Sudhakar Udumula - TOI Investigative Editor) ట్విట్టర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ఏసీబీ దాఖలు చేసిన ఆ దరఖాస్తుపై న్యాయస్థానం నుండి అధికారిక ఆదేశాలు ఇంకా వెలువడాల్సి ఉందని న్యాయవాది స్పష్టం చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.