ఘోర విషాదం: కోల్కతా దుర్గా పూజా పండాల్ తొక్కిసలాటలో 19 మంది మృతి
రిపోర్టర్: నరేష్
స్థలం: కోల్కతా
కోల్కతాలో జరిగిన దుర్గా పూజా పండాల్ తొక్కిసలాటలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కోల్కతాలోని చోర్బగన్ పండాల్ వద్ద పండాల్ కూలిపోతుందన్న వదంతులతో జరిగిన ఈ దుర్ఘటనలో మరో ఇరవై ఐదు మంది గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి పది రోజుల కస్టడీకి తరలించారు.