గోవిందా వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో కశ్మీరా షా ఘాటు విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

బాలీవుడ్ నటుడు గోవిందా తన సహనటి కోమల్ రాణి స్వార్ణకర్‌తో కలిసి కనిపిచడంపై ఆయన మేనల్లుడి భార్య కశ్మీరా షా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. భార్యలను వదిలేసి యువతులతో తిరిగే మగవాళ్లను, కుటుంబాలను విడగొట్టే వారిని ప్రమోట్ చేయవద్దంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మనుషులకంటే జంతువులే నమ్మదగినవంటూ గోవిందా సతీమణి సునీతా అహుజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ముంబైలో హాట్ టాపిక్‌గా మారాయి.