'మహిళల రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత': కోనసీమలో శక్తి యాప్‌పై అవగాహన సదస్సు

రిపోర్టర్: శివ స్థలం: Amalapuram

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం 'శక్తి యాప్'పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యవసర సమయాల్లో శక్తి యాప్ మరియు డయల్ 112ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై పోలీసు అధికారులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు.