రాప్తాడు బాధితురాలికి మంత్రి నారా లోకేష్ పరామర్శ: నిందితులపై కఠిన చర్యలు

రిపోర్టర్: అశోక్ స్థలం: అనంతపురం

రాప్తాడు ఘటన బాధితురాలిని బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడి, బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. జీవితాంతం ఆ కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడపిల్లల వైపు చూస్తే అదే చివరి రోజు అవుతుందని, పాఠశాలల్ లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు.