హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రైవేట్ హాస్టళ్లకు షాక్: ప్రభుత్వ వసతికి రంగం సిద్ధం

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ప్రైవేట్ హాస్టళ్లపై నియంత్రణతోపాటు ఉద్యోగులకు సురక్షితమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వం తరఫున హాస్టళ్లను నిర్మించే దిశగా అధికారులు కీలక అధ్యయనం చేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నాణ్యతలేని భవనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెరుగైన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోందని సమాచారం.