జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా సింగుపురపు దివ్యను ఏకగ్రీవంగా బలపరిచిన కూటమి నేతలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: సరుబుజ్జిలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన జడ్పీటీసీ అభ్యర్థిగా సింగుపురపు దివ్య ఖరారయ్యారు. ఎమ్మెల్యే కూన రవికుమార్, జనసేన ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఈ పరిణామం కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల శ్రేణులందరూ ఐక్యంగా కృషి చేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.