మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత: గుడివాడ అమర్నాథ్
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, ప్రజలకు మంచినీరు అందించడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మంచినీటికి బదులు మందు అందిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖలో మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నారని, ఇలాంటి ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్రంగా విమర్శించారు.