రైల్వే భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నామని కిషన్ రెడ్డి వెల్లడి

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రయాణీకుల భద్రతను అత్యున్నత ప్రమాాణాలతో కూడినదిగా మార్చేందుకు, నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్మార్ట్ సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతిక విప్లవం రైలు ప్రయాణాలను మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా మారుస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను ఆధునీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు.