పేపర్‌పైనే పాఠశాల నిర్మాణం.. రూ. 44 లక్షల నిధులు స్వాహా!

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బిహార్

బిహార్‌ కటిహార్‌ జిల్లాలో రూ. 44.85 లక్షలతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు స్వాహా చేశారు. తీరా అక్కడ చూస్తే కనీసం ఒక్క ఇటుక కూడా లేదు. మా పాఠశాలను ఎవరో దొంగిలించారు వెతికి పెట్టండంటూ గ్రామస్థులు డప్పుచప్పుళ్లతో వినూత్న నిరసన తెలిపి అధికారులకు ఫిర్యాదు చేశారు.