పరీక్షల్ లో ఏఐ గ్లాసెస్ కలకలం: కాపీ కొడుతూ దొరికిన విద్యార్థి బహిష్కరణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

పరీక్షల్ లో ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ధరించి కాపీ కొడుతూ ఒక విద్యార్థి దొరికిపోయాడని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన విద్యా రంగంలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆ విద్యార్థిని మిగిలిన సెమిస్టర్ పరీక్షలు రాయకుండా యాజమాన్యం కఠినంగా బహిష్కరించింది.