దేశంలో ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో నిర్వహించిన ఛాత్రోకీ గూంజ్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని విద్యార్థులు, నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ప్రశ్నించకూడదని భావించే వ్యవస్థలు రాజ్యమేలుతున్నాయని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు అనేక వ్యవస్థలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నియంత్రిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు, నియామకాల నిలిపివేతపై విద్యార్థులు తమ ఆవేదనను ఈ వేదికగా వెలిబుచ్చారు.