గంజాయి మత్తులో చిక్కుకుని పోలీసులకు చిక్కిన యువకులు
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం మండలంలో గంజాయి వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు బంగార్రాజు, వెంకటేష్‌లు గంజాయి నిలయాలపై దాడులు చేపట్టారు. అదుపులోకి తీసుకున్న యువకులకు పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.