పరేడ్ గ్రౌండ్స్ లో చెత్తాచెదారంపై క్రీడాకారుల తీవ్ర అసహనం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ దుస్థితిపై క్రీడాకారులు, స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేడుకల తర్వాత భోజన ప్లేట్లు, వ్యర్థాలను శుభ్రం చేయకపోవడంతో ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం సాధన చేసేందుకు వచ్చే తమకు ఈ చెత్తాచెదారం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని, మైదానాన్ని వెంటనే శుభ్రం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.