ఢిల్లీలో సెప్టెంబర్ 11న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో సెప్టెంబర్ 11న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్యూలు మూతపడనున్నాయి. అయితే, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తించదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ అతిథుల రాక, భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాలతో కలిపి ఉద్యోగులకు మూడు రోజుల సెలవులు రానున్నాయి.