ఏపీలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్: ఎస్ఈసీ అనిల్ చంద్ర వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. విజయవాడలో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.