పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన జెండా: ఘన విజయం సాధించిన లాజర్ బాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: పిఠాపురం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు చైర్మన్గా ఘన విజయం సాధించారని అధికారులు తెలిపారు. తొమ్మిది వేలకు పైగా భారీ ఓట్ల మెజార్టీతో ఆయన తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారని అధికారులు వెల్లడించారు. పవన్ సొంత గడ్డపై పార్టీ జెండా ఎగరడంతో జనసేన శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సంబురాలు నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.