పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం షాద్ నగర్ లో లక్ష సంతకాల మహోద్యమం

రిపోర్టర్: రాజేష్ స్థలం: షాద్ నగర్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ షాద్ నగర్ బస్టాండ్ ఆవరణలో జేఏసీ కన్వీనర్ టీజీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష సంతకాల మహోద్యమం నిర్వహించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేసి తమ మద్దతును తెలపడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.