స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరగడంపై అశ్విన్ గణేష్ ఆగ్రహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh / Telangana
స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రముఖ టెక్ రివ్యూయర్ అశ్విన్ గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ల ధరలు అత్యంత దారుణంగా పెరిగిపోయిన కారణంగా ఇప్పుడు ఏకంగా బిలియనీర్లు సైతం రెండు సంవత్సరాల క్రితం నాటి పాత మోడల్ ఫోన్లనే వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆయన ఎద్దేవా చేశారు. టెక్నాలజీ రంగంలో ధరల పెరుగుదల సామాన్యులకే కాకుండా సంపన్నులను సైతం ఆలోచనలో పడేస్తోందని అశ్విన్ గణేష్ (C4ETech - స్మార్ట్ఫోన్ రివ్యూలు & కెమెరా టెస్ట్స్) సోషల్ మీడియా వేదికగా చమత్కరించారు.