శ్రీకాళహస్తిలో శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన రిషితా రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్‌ను బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాణ్యమైన సరుకులు అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.