డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: మంత్రి నారా లోకేశ్ మండిపాటు

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh

మెగా డీఎస్సీ-2025 నియామకాలపై వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలు చేస్తూ క్రీడాకారులను అవమానిస్తోందని మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ ఛాంపియన్ పెద్ద అప్పలరాజు ఉద్యొగాన్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం గర్వించే క్రీడాకారుడిపై ఫేక్ ప్రచారం ఆపాలని హితవు పలికారు. మరోవైపు, ఏడు తరగతులు కూడా పాస్ కాని కొడాలి నానికి విద్యా వ్యవస్థపై మాట్లాడే అర్హత లేదని మంత్రి వాసంశెట్టి సుభాశ్ విమర్శించారు.