బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్న తాళ్లపల్లి రాజేశ్వర్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తాళ్లపల్లి రాజేశ్వర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ కుల సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.