సోషల్ మీడియాలో సంచలనం: ఏకంగా ఇరవై ఒక్క మంది భార్యలతో యాచకుడు
రిపోర్టర్: శివ
స్థలం: బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌కు చెందిన ముప్పై ఐదు సంవత్సరాల యాచకుడు ఏకంగా ఇరవై ఒక్క మంది భార్యలను కలిగి ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మహిళలే తనను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చారని అతడు తెలిపినట్లు సమాచారం. కుటుంబ పోషణ కోసం భార్యలు వంతులవారీగా తనతో కలిసి భిక్షాటనకు వస్తారని అతడు పేర్కొన్నట్లు కథనాల్లో పేర్కొన్నారు. ఈ వింతైన వివాహ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.