వరద ముంపు నివారణకు రూ.68 కోట్లు కేటాయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Guntur

మంగళగిరి తాడేపల్లిలో వరద ముంపు నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.68.73 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలకు శాశ్వత పరిష్కారం అందించే లక్ష్యంతో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ అభివృద్ధి కోసం ఈ నిధులను విడుదల చేశారు. మంగళగిరి డివిజన్లో 26 పనుల కోసం రూ.33 కోట్లు, తాడేపల్లి డివిజన్లో 11 పనుల కోసం రూ.35.73 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.