గరివిడి లక్ష్మి బయోపిక్ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు

రిపోర్టర్: అశోక్ స్థలం: Vizianagaram

ప్రముఖ జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, అక్టోబర్ 17న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.