జంతర్ మంతర్ దాడి కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్న నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వైరల్ వీడియోల ఆధారంగా పోలీసులు వందకు పైగా ప్రశ్నలు సంధించగా, నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపం చూపలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.