చిన్న పట్టణాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మార్చాలి: ప్రధాని మోదీ పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: పుణె
దేశంలోని చిన్న పట్టణాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రూ.21,800 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన పుణె మెట్రో ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలు కేవలం నివసించే ప్రదేశాలు కాదని, దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలని మోదీ నొక్ కి చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా పాల్గొని, ప్రాజెక్ట్ విశేషాలను పరిశీలించారు.