ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని ఉపాధ్యాయుడి డిమాండ్

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో 2002 డీఎస్సీ ఎస్జీటీ ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఇరవై నాలుగు సంవత్సరాల సేవలను పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్జీటీ ఉపాధ్యాయులకు దక్కవలసిన ప్రమోషన్లు, ముప్పై సంవత్సరాల స్కేలు అమలు కోసం ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక దృష్టిసారించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.