పంజాబ్‌లో బీజేపీ నేత రవ్‌నీత్ బిట్టు కాన్వాయ్‌పై దాడి

రిపోర్టర్: నరేష్ స్థలం: Punjab

పంజాబ్‌లోని బటాలా-గురుదాస్‌పూర్ హైవేపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కాన్వాయ్‌పై దుండగులు గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. పఠాకోట్‌లో జరిగే మత్తుపదార్థాల వ్యతిరేక కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తనపై జరిగిన దాడికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాష్ట్ర డీజీపీయే బాధ్యులని బిట్టు తీవ్రంగా ఆరోపించారు.