ఆరోగ్యానికి ఎండు రొయ్యలు చేసే మేలు: ఎముకలు బలంగా మార్చే అద్భుత పోషకాలు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఎండు రొయ్యలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్ తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ బి 12 వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా ఎండు రొయ్యలు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కండరాల నిర్మాణం బలపడటంతో పాటు రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఎముకల సాంద్రతను పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు వెల్లడించారు.