హనుమకొండలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హనుమకొండ
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మధుతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన వందలాది బస్తాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేదలకు అందించాల్సిన సన్న బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైస్ మిల్లుల్లో రీపాలిష్ పట్టి ప్రైవేట్ బ్రాండ్లతో అధిక ధరలకు అమ్ముతున్నారు. దాదాపు రెండు లక్షలకు పైగా విలువైన బియ్యాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.