షాకింగ్ ఘటన: జ్యూస్ అనుకుని దగ్గు మందు తాగి నాలుగేళ్ల చిన్నారి మృతి

రిపోర్టర్: గోపి స్థలం: హర్దోయ్

ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ జిల్లాలో బంధువుల ఇంటికి వెళ్లిన నాలుగేళ్ల బాలిక జ్యూస్ అనుకుని దగ్గు మందు తాగడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెరాడి గ్రామానికి చెందిన ఆ చిన్నారి నామకరణ కార్యక్రమానికి వెళ్లింది. వృద్ధుడు తాగిన దగ్గు మందు బాటిల్ను జ్యూస్గా భావించి తాగేసింది. కొంతసేపు ఆడుకుని నిద్రపోయిన బాలిక ఉదయం లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు వెల్లడించారు.