ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు

రిపోర్టర్: సురేష్ స్థలం: India

ఎఫ్‌సీఆర్ఏ (FCRA) సవరణ బిల్లుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభ మరియు రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. దేశ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో కీలక మార్పులు తీసుకువచ్చేందుకు ఈ కమిటీ కసరత్తు చేయనుంది.