స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ప్రత్యేక సదస్సు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ తాడేపల్లిలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.