హైదరాబాద్లో తనకు మూడు హోటళ్లు ఉన్నాయన్న కేటీఆర్ స్పష్టత
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో తనకు మూడు హోటళ్లు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, ఎన్నికల అఫిడవిట్లోనూ ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. తన భార్య శైలిమ డైరెక్టర్గా ఉన్న ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో ఈ హోటళ్లు నడుస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాపార వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.