మా భూములు లాక్కుంటే బతుకులు ఆగం అవుతాయని దళితుల ఆవేదన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Erravelli
తమ తాతాముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే బతుకులు ఆగం అవుతాయని ఎర్రవెల్లి దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 325 భూములకు మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దళితులమైన మా భూములను లాక్కొని ఇస్తామనడం సరికాదని, మాకున్న ఎకరా భూమిని కూడా లాక్కోవద్దని వారు వాపోయారు.