నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల ప్రత్యేక దీపోత్సవం

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: ఐనవిల్లి

ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఆరో జన్మదినం సందర్భంగా గురువారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుమర్తి బేబీ రాణి ఆధ్వర్యంలో డెబ్బై ఆరు అంకె ఆకారంలో దీపాలు వెలిగించి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక అలంకరణ ఆలయానికి విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, అనంతరం అందరికీ మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.