తిరుమలలో కన్నులపండువగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీమలయప్ప స్వామి ఇవాళ ఉదయం సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణ స్వామి అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. బంగారు పూత పూసిన సప్త అశ్వాల వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించగా దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గోవింద నామస్మరణలతో మార్మోగింది. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని మరింత ఇనుమడింపజేశాయి.