ఢిల్లీ ఘటనపై దిగ్భ్రాంతి: మహిళలపై దాడులు అన్యాయమంటూ మల్లు భట్టి విక్రమార్క ఆవేదన
రిపోర్టర్: మహేష్
స్థలం: ఖమ్మం
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ గొంతు వినిపిస్తే దాడులకు భయపడాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నిజమైన విలువ వారు ఇచ్చే హామీలలో కాదని, మహిళల పట్ల ప్రభుత్వాల ప్రవర్తనలోనే ఉంటుందని మల్లు భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు.