జీపీ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై రేవంత్ ప్రభుత్వం నిషేధం
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో గ్రామపంచాయతీ లేఅవుట్లలో ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. జీవో 28 ద్వారా రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంపై తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. చట్టవిరుద్ధంగా ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల లక్షలాది మంది కొనుగోలుదారులు, రియల్టర్లు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.