యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు హత్య కేసులో నిందితుడు గంధం సంతోష్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చెల్లెలు వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే అతడిని హతమార్చినట్లు సంతోష్ అంగీకరించాడని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు.