కిర్లంపూడిలో శనివారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

రిపోర్టర్: U.Srinivasarao స్థలం: కిర్లంపూడి

కిర్లంపూడి ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీపీ తోట సూర్యనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రగతి నివేదికలపై చర్చించనున్నారు. సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు తప్పక హాజరు కావాలని ఎంపీడీవో బాయిశెట్టి హరికృష్ణ తెలిపారు.