నాపై కుట్రలు, నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు

రిపోర్టర్: గోపి స్థలం: ఆంధ్రప్రదేశ్

తిరుపతి వ్యాఖ్యలపై పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంపై వైయస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఘటనకు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదని, ఈ నోటీసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.