తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నవంబర్ ఒకటో తేదీన భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో వరంగల్ రైల్వే మ్యానుఫాక్చరింగ్ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.