కాంగ్రెస్ చేతకానితనంతోనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందంటూ హరీష్ రావు ఫైర్

రిపోర్టర్: సునీల్ స్థలం: తెలంగాణ

ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ చేతకానితనంతో వచ్చిన కరువు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో పాటు రెండు పంటలకు రైతు బంధు అందించినట్లు గుర్తుచేశారు. నేడు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలు విధిస్తూ రైతన్నలను గోస పెడుతోందని ఆయన ఘాటు విమర్శలు చేశారు.