గూగుల్ ఫోటోస్ యాప్లో శక్తివంతమైన సరికొత్త ఫీచర్లు విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ఫొటోలను ఎడిట్ చేయడం మరియు ఆర్గనైజ్ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫోటోస్ యాప్లో పలు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. రెడాక్ట్ పెన్, మూడ్స్, రీమిక్స్ టెంప్లేట్లు, ఏఐ వార్డ్రోబ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో పాటు జెమిని స్పార్క్ను కూడా అనుసంధానిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ సేవలు ప్రాంతాల వారీగా దశలవారీగా అందుబాటులోకి వస్తున్నట్లు స్పష్టం చేశాయి.