పురపాలక ఎన్నికల్ లో ఉద్రిక్తత: వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు
రిపోర్టర్: గోపి
స్థలం: కడప
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పురపాలక ఎన్నికల పోలింగ్ పలు ప్రాంతాల్ లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. యర్రగుడిపల్లి వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా, ఉలిమెల గ్రామంలో వాహనాలకు దుండగులు నిప్పుపెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.