విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపునకు ధ్యానం ఎంతో అవసరం: రాజేశ్వరి పిలుపు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని శ్రీ సూర్య పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక మెడిటేషన్, నైతిక విలువల తరగతులు నిర్వహించారు. సంస్థ ఇన్చార్జి బీకే రాజేశ్వరి విద్యార్థులకు రాజయోగ సాధన ప్రాముఖ్యతను వివరించారు. నిత్యం ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, శారీరక మానసిక ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రాజయోగాన్ని అభ్యసించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.