శిఖర్ ధావన్ సంచలన ప్రకటన: టోర్నీ నిర్వాహకులపై లీగల్ చర్యలకు సిద్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాదాస్పద వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండానే టోర్నీలో ఆడుతున్నట్లు పేరు చేర్చడంపై ఆయన మండిపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లు ఉన్న ఆసియా వారియర్స్ జట్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ధావన్ హెచ్చరించినట్లు ఆయన బృందం స్పష్టం చేసింది.